AP: విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్, బాలాజీ గోవిందప్ప బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ మంజూరైనప్పటికీ, మూడు గంటల హైడ్రామా తర్వాత వారిని జైలు అధికారులు విడుదల చేశారు. నిందితులలో ఒకరైన ధనుంజయ రెడ్డి స్పందిస్తూ.. తమ విడుదల ఆలస్యం కావడానికి అధికారులే కారణమని ఆరోపించారు. నిన్ననే బెయిల్ వచ్చినా కావాలని విడుదల ఆలస్యం చేశారని పేర్కొన్నారు.