కృష్ణా: కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లి రోడ్లో కోమటి గుంట లాకులు దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం శుక్రవారం జరిగింది. ఏలూరు జిల్లా కలదిండి మండలం మట్టగుంట గ్రామానికి చెందిన అశోక్ బైక్పై వెళ్తుండగా రోడ్డు మధ్యలో గొతి ఉండడంతో పడిపోగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందాడు.