జింబాబ్వే క్రికెట్ జట్టు శ్రీలంకకు షాక్ ఇచ్చింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక కేవలం 80 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఎవాన్స్, సికందర్ రజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం, జింబాబ్వే 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను 1-1తో సమం చేసింది.