ADB: జిల్లావ్యాప్తంగా రెండు వేల గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు జిల్లావ్యాప్తంగా 1500 గణపతుల నిమర్జనాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నారు. శనివారం 450 గణపతి విగ్రహాల నిమజ్జనం ఉందని పేర్కొన్నారు. చివరి గణపతి నిమర్జనం పూర్తి అయ్యే వరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతోనే వ్యవహరిస్తుందని తెలిపారు.