NLR: తల్లి జన్మనిస్తే, తండ్రి నడక నేర్పితే, జీవితాన్ని తీర్చిదిద్దేది గురువేనని, ఈ సృష్టిలో గురువు స్థానమే అత్యున్నతమని, గురువుని పూజించడం అనేది ముల్లోకాల పూజతో సమానమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం కావలి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఉపాధ్యాయులను సత్కరించారు.