AKP: నర్సీపట్నంలోని బ్రిటిష్ సమాధుల స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జీ.కోటేశ్వరరావు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ స్థలాలు ఆక్రమణలకు గురైనప్పటికీ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ స్థలంలో కొత్తగా నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఆ ఉత్తర్వులను ఖాతరు చేయలేదని చెప్పారు.