SKLM: పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన అన్నేపు శేషాద్రి నాయుడు డీఎస్సీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఇవాళ దూసిలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస MLA కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శేషాద్రి నాయుడును శాలువాతో సన్మానించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.