ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. విమానం విక్టోరియా సర్సులో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం.
టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ప్రయత్నంలో, ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న సరస్సులో కూలిపోయింది. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది 26 మందిని కాపాడారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
కాగా… విమానం నీటిలో కూలిన సమయంలో.. చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు విమానం పై భాగానికి చేరుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ ఘటన పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.