GNTR: కొల్లిపర గ్రామానికి చెందిన కాకి చిట్టిబాబు (29) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. రోజు మాదిరిగానే విజయవాడలో కరెంటు పనికి బయలుదేరగా, మార్గమధ్యలో ఛాతీలో నొప్పి వచ్చి కుర్చీలో కూలబడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.