ప్రకాశం: పిచ్చాటూరు మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఓ వైపు హైవే రోడ్డు, మరోవైపు అరణీయార్ చెరువు ఉంది. ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు భద్రత పరంగా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట మందుబాబులకు నిలయంగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు కోరుతున్నారు.