SKLM: జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. పాఠశాలలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. ఉపాధ్యాయుడు మెండ రామారావు మాట్లాడుతూ.. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.