KMM: ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 9,282 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 78 గ్రామాల్లో మొత్తం 6,559 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. వర్షాలు, వరద ప్రవాహం తగ్గితే నష్టపోయిన రైతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.