TG: మహబూబాబాద్ జిల్లాలో సోషల్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు చెట్టబోయిన స్వామి ఆదర్శంగా నిలుస్తున్నారు. తొర్రూరు మండలం కంఠాయపాలెం పాఠశాలలో పనిచేస్తున్న ఆయన.. ఏడేళ్లలో ఒక్క సెలవు కూడా పెట్టలేదు. గుర్తూరు గ్రామానికి చెందిన స్వామి 2012లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. అయితే గత ఏడేళ్ల నుంచి ఆయన సొంత పనులను సెలవు రోజుల్లో పూర్తి చేసుకుంటూ.. పాఠశాలకు ఒక్కరోజు కూడా డుమ్మ కొట్టలేదు.