BDK: కొత్తగూడెం నుండి విజయవాడ వెళ్లే హైవే రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం కొత్తగూడెంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న BSNL కార్యాలయం ముందు ఓ లారీ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.