KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు 64,106 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి 20,600 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. మరో 1,000 క్యూసెక్కులు పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా విడుదల చేశారు.