GDL: గద్వాలలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను కలెక్టర్ సంతోష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని ఆయన ఆదేశించారు. భోజనం ప్రారంభం కాకముందే మెస్ కమిటీ సభ్యులు సంతకాలు చేయాలని సూచించారు. కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్లలోని సౌకర్యాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు.