నెల్లూరు: నిర్మాణ దశలో ఉన్న గృహాలు త్వరగా పూర్తి చేయాలని అనంతసాగరం ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ కోరారు. ఉప్పలపాడు సచివాలయంలో లబ్ధిదారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గృహాలు నిర్మించుకునే వారికి అదనపు సహాయం అందిస్తుందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శరత్ పాల్గొన్నారు.