KMR: సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు సీపీఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలును గురువారం ఉదయం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యపై స్పందించిన ఆయన ప్రజా పాలనలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి సీఎం పర్యటించడం సిగ్గుచేటు అని అన్నారు. సీఎం పర్య టన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.