W.G: ‘భవ్య భీమవరం’ అభివృద్ధి పనులపై జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పనుల పురోగతి, పింక్ టాయిలెట్ల నిర్మాణంపై ఆయన సంబంధిత శాఖల అధికారులను ఆరా తీశారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.