BHPL: జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బుధవారం వివిధ వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.