NLG: ఉపాధ్యాయ దినోత్సవానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి జిల్లా అవార్డు టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. జిల్లా అధ్యక్షుడు వడిత్య వెంకట్రామ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నన్నూరి వెంకట్ రెడ్డి బుధవారం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మండలానికి రూ. 5వేలు, జిల్లా కేంద్రానికి రూ. 15 వేలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.