తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభానికి హాజరైన ప్రధాని మోదీ బిజీబిజీగా గడిపారు. పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని పలు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రిమోట్ ద్వారా చేసిన అనంతరం మోదీ ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు. ‘ప్రియమైన సోదర, సోదరిమణులకు నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభం. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్నందుకు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు’ అని మోదీ మాట్లాడారు.
ప్రసంగం ఆయన మాట్లాల్లోనే.. ‘తెలంగాణ- ఏపీని కలుపుతూ మరో వందే భారత్ రైల్ వేశాం. హైదరాబాద్ లోని భాగలక్ష్మి ఆలయం నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వరకు రైలు వేశాం. ఎంఎంటీఎస్ వేగవంతంగా నిర్వహించారు. రైల్వే వ్యవస్థ మరుగుపరచడం ద్వారా మారుమూల మరో జిల్లాలకు లాభం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం మరచిపోలేనిది’ అని తెలిపారు.
– ఎంఎంటీఎస్ వేగవంతంగా నిర్వహించారు. రైల్వే వ్యవస్థ మరుగుపరచడం ద్వారా మారుమూల మరో జిల్లాలకు లాభం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం మరచిపోలేనిది.
– అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
– కొత్తగా 11 ఎంఎంటీఎస్ రైలు సేవులు ప్రారంభించాం. వీటి ద్వారా హైదరాబాద్ ప్రజలకు మేలు కలుగుతుంది.
– తెలంగాణ అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కింది. రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించాం.
వాటి స్ఫూర్తితోనే మా పాలన
‘మహోన్నతమైన ఉద్యమాలకు,పోరాట యోధులకు నిలయమైన తెలంగాణ నేలకు నా వందనాలు. తెలంగాణ అభివృద్ధి కోసం తోడ్పడే గొప్ప అవకాశం ఈరోజు నాకు కలిగింది. నేడు జాతికి అంకితం చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ మన విశ్వాసాన్ని,సాంకేతికతను, ఆధునికతను మరింత ఇనుమడింప చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, స్వప్నాలను నెరవేర్చేందుకు అనునిత్యం అంకితభావంతో కృషి చేస్తుంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్ , సబ్ కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మంత్ర స్ఫూర్తితోనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం’ అని ప్రధాని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
అభివృద్ధి పనుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు. సహకరించకపోవడం వలన అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయి.