నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తోన్న మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ‘నదివే.. నదియే.. నిలవే.. స్వరావే’ అంటూ సాగే ఈ పాటను ఈ నెల 16న రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. దానికి ‘మీ ఆత్మలో ప్రతిధ్వనిస్తోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.