తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Telangana IT minister KT Rama Rao), తెలంగాణ బీజేపీ నేతల (Telangana BJP leaders) మధ్య ట్విట్టర్ లో (Twitter) మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ ను (Telangana BJP chief Bandi Sanjay) అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మలను (KCR effigy) దగ్ధం చేశారు. ఓ వైపు ఈ రాజకీయ వేడి కొనసాగుతుండగా మరోవైపు కేంద్రంలో ధరలు పెంచారంటూ కేటీఆర్, తెలంగాణలో అవినీతితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, కేసీఆర్ కుటుంబం కోట్లు సంపాదిస్తోందంటూ బీజేపీ ట్వీట్ చేశాయి.
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరం
అన్నీ పిరం.. పిరం…
జనమంతా గరం… గరం…
అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని… మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ..” అని ట్వీట్ చేశారు.
మోడీ గారు చమురు ఉత్పత్తుల పైన అదనపు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, పెరుగుతునన ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
బీజేపీ కౌంటర్ (BJP)
చమురు ధరలు (Petrol prices) తెలంగాణలో (Telangana) మాత్రమే ఎక్కువగా ఉన్నాయని, అందుకే తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా సరిహద్దుల్లో కర్నాటకలో డీజిల్ కొనుగోలు చేస్తున్నాయని గట్టి కౌంటర్ ఇచ్చింది. కేంద్రానిదే బాధ్యత అయితే కర్నాటక, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే పది అంతకంటే ఎక్కువ పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఉప్పు, పప్పుల ధరలు గత ప్రభుత్వాల హయంలో ఎంత పెరిగాయి.. ఇప్పుడు ఎంత పెరిగాయో చెప్పాలని నిలదీశారు.
తెలంగాణలో అవినీతి అంటూ వీడియో
తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, పెద్ద ఎత్తున కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది. ఈ వీడియోలో TR51KTR అనే కారు నుండి కేసీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులతో కూడిన సూటు కేసుతో దిగుతారు. రైతు బంధు, ఆసరా పెన్షన్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ, ఇతర చిన్న చిన్న స్కీంల పేరుతో ఆ మొత్తాన్ని బీఆర్ఎస్ ఖజానాకు పంపిస్తున్నాడని, జీఎస్టీ, కేంద్రం నుండి వచ్చిన గ్రామ పంచాయతీ నిధులతోను తమ ఖజానాను నింపుకుంటున్నాడని, వాటి ద్వారా ప్రధాని పదవి కల కంటున్నాడని ఈ వీడియో సారాంశం.