NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షమ్మ దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపుగా 20 రోజులకు గాను శ్రీవార్ల హుండీ ఆదాయం 13,82,435 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.