AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in నుంచి పొందవచ్చని తెలిపింది. హాల్ టికెట్లో పేరు, రోల్ నంబర్, ఫొటో వంటి వివరాలను సరిచూసుకోవాలని.. ఏవైనా తప్పులుంటే పాఠశాల అధికారులకు తెలపాలని సూచించింది. కాగా, మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.