విజయ్ దేవరకొండను చూసి మొదట్లో భయపడ్డానని రష్మిక గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి బెరుకుగా ఉండేదని, అందుకే విజయ్‌తో నటించేటప్పుడు ఆందోళన పడ్డానని పేర్కొంది. విజయ్ చాలా కూల్ అని, అతని వల్ల సెట్లో పాజిటివ్ వాతావరణం ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం వీరిద్దరూ ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు.