ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రేపు ( బుధవారం ) సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లో క్రయ విక్రయాలు జరగవని తెలిపారు. తిరిగి ఎల్లుండి ( గురువారం ) నుంచి క్రయ విక్రయాలు యధావిధిగా జరుగుతాయని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని వారు సూచించారు.