VZM: రాత్రి సమయంలో మహిళ తహసీల్దార్‌కు వాట్సాప్ కాల్ చేయాల్సిన అవసరం ఏమిటని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్వతీపురం ఎమ్మెల్యే తీరు సరికాదని, అధికారులను ఈ రకంగా భయబ్రాంతులకు గురిచేయడం ఒక ప్రజా ప్రతినిధికి కరెక్టేనా అని ప్రశ్నించారు. మొదటి నుంచి MLA తీరు వింతగా ఉందన్నారు.