TPT: తిరుపతి నగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా నగరంలో వాతావరణం వేడిగా ఉంది. ఉక్కపోతతో ఇబ్బందులు పడిన స్థానిక ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే, ఉరుములతో భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.