అనంతపురం: నగరంలో శనివారం భారత సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, హాజరయ్యారు. నగరంలో పురవీధుల గుండా జాతీయ జెండాలను పట్టుకుని పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.