MDK: నిజాంపేట మండలం నందిగామ గ్రామం నుంచి బచ్చురాజుపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు వేసి సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదని ఇరు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారుల స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.