GNTR: అమృత్ 2.0 పథకం కింద గోరంట్ల వాటర్ స్కీమ్ కోసం రూ. 362. 23 కోట్ల నిధులు విడుదలయ్యాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం గుంటూరులో శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంలో భాగంగా భూసేకరణకు సహకరించిన యజమానులకు చెక్కులను పంపిణీ చేశారు.