WNP: అమరచింత పట్టణంలోని డీఎంఆర్ఎం పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వందేమాతరం ఫౌండేషన్ ఛైర్మన్ మాధవరెడ్డి, హైకోర్టు న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. 280 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. చదువుతోపాటు సంస్కారం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఛైర్మన్ అన్నారు.