నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్ కావేరి అవెన్యూలో 33 లక్షల రూపాయలు వ్యయంతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్‌కు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. దాదాపుగా 25 రోజుల్లోనే రోడ్డు, డ్రైన్ వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కోటంరెడ్డి తెలిపారు. రూరల్‌కు ఎంత చేసినా తక్కువే అని అన్నారు.