KDP: కొనుగోలుదారుల ముసుగులో దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడి లేడి ముఠాను శుక్రవారం కడప టూ టౌన్ పోలీసుల అరెస్టు చేశారు. వాసవి సర్కిల్ వద్ద తారక రామారావు నగర్‌కు చెందిన కమ్మవారిపల్లి రామాంజనమ్మ, పోలా నాగవేణి, మన్నూరు లక్ష్మమ్మను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నామని SI వెల్లడించారు.