SRD: నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఖేడ్ RTC డీఎం మల్లేశం అన్నారు. మంగళవారం ఆర్టీసీ బస్ స్టాప్‌లో నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో వచ్చిన ఫోన్ కాల్స్‌కు ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. కంగ్టి, లింగంపల్లి, హనుమంతరావుపేట, సంగారెడ్డి బస్సులు నడపాలని ప్రయాణికులు కోరినట్లు చెప్పారు.