PLD: వినుకొండ మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటనపై మంత్రి లోకేష్ ఆరా తీశారని.. ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారికి భరోసా కల్పించారు.