MNCL: ఆదివాసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. జన్నారంలోని హరిత రిసార్ట్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఆదివాసి నాయకులు, కార్యకర్తలకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో మంగళవారం సీతక్క పాల్గొని ప్రసంగించారు. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.