MBNR: ఈనెల 22 నుంచి 27వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలకు మొత్తంగా 9,069 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు.