కోనసీమ: కందికుప్ప RWS స్కీమ్ పరిధిలో ఈ నెల 13, 14 తేదీల్లో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు RWS జేఈ సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపారు. కందికుప్ప సెంటర్లో ప్రధాన రహదారి దిగువన పగిలిన తాగునీటి పైపులైన్‌కు మరమ్మతులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా కందికుప్ప, దొంతికుర్రు, పల్లం, పల్లంకుర్రు, బ్రహ్మసమేద్యం గ్రామాలలో నీళ్లు రావన్నారు.