KMR: బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం నుంచి టోల్ ప్లాజాలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా కిలోమీటర్ మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 30 నిమిషాల పాటు సమస్య తలెత్తింది.