టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, ఆయన ఎనర్జీ, డ్యాన్స్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు. అలాగే మహేష్ బాబు క్లాస్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అంటే కూడా తనకు మక్కువని పేర్కొన్నాడు. మలయాళీ అయినా తెలుగు మాస్ సినిమాలను తాను క్రమం తప్పకుండా చూస్తానని వెల్లడించాడు.