MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని 4 సంవత్సరాల బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం అధికారి రాజకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ప్రకటన విడుదల చేశారు. పరీక్షల తేదీలను త్వరలో వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు పేర్కొన్నారు.