NTR: రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం జాయింట్ డైరెక్టర్ తెహ్రీ సుల్తానా విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, రెడ్డిగూడెంలో ఈ ఆదర్శ పాఠశాలలు ఉన్న సంగతి విధితమే. మెరిట్ లిస్ట్ తయారు చేసి ప్రకటించవలసినదిగా DEO ఉత్తర్వులు జారీ చేశారు.