వనపర్తి జిల్లాలోని 5 పురపాలికల్లో 2025-2026 ఆర్థిక సంవత్సరం కోట్లలో పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు లక్ష్యంలో సగం వరకు మాత్రమే సిబ్బంది వసూలు చేయగలిగారు. ఈ నెలాఖరు వరకు వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొత్తంగా లక్ష్యం చేరుకోవడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.