NTR: అమరావతిలో మే నెల 2న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై సీపీ రాజశేఖర్ బాబు పోలీస్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పలువురు వీఐపీలు విజయవాడ మీదుగా అమరావతికి వెళ్లనున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని సీపీ అన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.