HYD: మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూసీ ప్రాజెక్టు అభివృద్ధిపై చక చకా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే మీర్అలం ట్యాంకు వద్ద భూ పరీక్షలు నిర్వహించేందుకు బిడ్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. మూసీకి ఆనుకుని ఉన్న భూమి పరిస్థితి, భూబలం, ఇతర సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షలు తోడ్పడనున్నాయి.