కృష్ణా: గుడివాడ మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మనోహర్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును శుక్రవారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కమిషనర్ ఎమ్మెల్యేకు పూల మొక్కను అందించారు. అనంతరం పట్టణ స్థితిగతులపై కొద్దిసేపు కమిషనర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు.