KDP: ఆటో, స్కూటర్ ఢీకొన్న ఘటన గురువారం ఒంటిమిట్ట మండలంలో చోటు చేసుకుంది. జీకే వెంకటసుబ్బారెడ్డి పొలం పనుల నిమిత్తం వరి నారుకు నీరు కొట్టుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇబ్రహీంపేట రోడ్డు నుంచి తప్పెటవారిపల్లి వస్తున్న సమయంలో ఒంటిమిట్ట నుంచి ఇబ్రహీంకి వెళ్తున్న ఆటో స్కూటర్‌ను ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్ అనుచరులు తనపై దాడి చేశారని క్షతగాత్రుడు వాపోయాడు.